కిల్లర్ కాదు.. లవర్.. ఒకే ఫ్రేమ్లో షారుఖ్ త్రీ ఎలిమెంట్స్

కిల్లర్ కాదు.. లవర్.. ఒకే ఫ్రేమ్లో షారుఖ్ త్రీ ఎలిమెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో   షారుఖ్ ఖాన్ అంటేనే స్టైలిష్ యాక్షన్, అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్‌‌తో పాటు మనసు దోచుకునే రొమాన్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ మూడు ఎలిమెంట్స్‌‌ను   ఒకే ఫ్రేమ్‌‌లో చూపిస్తూ ‘కింగ్’ మూవీ నుంచి విడుదలైన కొత్త పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.  

పెదాల మధ్య గులాబీ పువ్వు.. కళ్లలో నిప్పులు చెరిగే తీక్షణత.. ముఖంలో కనిపించే ఇంటెన్సిటీ.. ఇలా షారుఖ్ కనిపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతోంది.  హంతకుడిలా కనిపించే చూపులు.. ప్రేమికుడిలా పలకరించే గులాబీతో ఉన్న ఈ పోస్టర్   షారుఖ్‌‌లోని రఫ్‌‌నెస్, స్టైలిష్ అప్పీల్‌‌తో పాటు రొమాంటిక్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ఈ భారీ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్, మార్‌‌ఫ్లిక్స్ పిక్చర్స్ కలిసి  నిర్మిస్తున్నాయి.  యాక్షన్, ఎమోషన్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం డిసెంబర్ 24న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల  కానుంది.