- పైలెట్ ప్రాజెక్టుగా గోల్కొండలో ప్రారంభం
- దశలవారీగా అన్ని పీఎస్‌లకు విస్తరిస్తామన్న సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా జోనల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ను మోహిదీపట్నంలోని గోల్కొండ జోన్ డీసీపీ ఆఫీసులో మంగళవారం సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఇప్పటివరకు పోలీసులే లా అండ్ ఆర్డర్ తో పాటు క్రైమ్ఇన్వెస్టిగేషన్చేయాల్సి వస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల కొన్నిసార్లు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో ఈ రెండింటిని వేరు చేస్తూ తీవ్రమైన, సంక్లిష్టమైన కేసులను పకడ్బందీగా విచారించేందుకు ‘జోనల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్’ అనే స్పెషల్‌టీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఇద్దరు డీఐలు.. ఎస్సై..
ఈ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో ఇద్దరు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్, 10 మంది కానిస్టేబుల్స్ఉంటారు. వీరు జోన్ పరిధిలో నమోదయ్యే గ్రేవ్ కేసులపైనే పూర్తి ఏకాగ్రత పెడతారు. హెల్త్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, లీగల్తదితర కీలక ప్రభుత్వ విభాగాలతో ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్చేసుకుంటూ సైంటిఫిక్ఎవిడెన్స్తో చార్జిషీట్లు ఫైల్చేసి నిందితులకు కోర్టుల్లో కఠిన శిక్షలు పడేలా చూస్తారు.
పీఎస్‌లపై ఒత్తిడి తగ్గుతది : సీపీ సజ్జనార్
లా అండ్ఆర్డర్, క్రైమ్ఇన్వెస్టిగేషన్ను వేర్వేరు చేయడం వల్ల స్థానిక పోలీస్ స్టేషన్లపై పని ఒత్తిడి తగ్గి, నేరాల నియంత్రణకు, నాణ్యమైన దర్యాప్తునకు రెట్టింపు బలం చేకూరుతుందని సీపీ సజ్జనార్స్పష్టం చేశారు. గోల్కొండ జోన్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లు..తర్వాత కమిషనరేట్ పరిధిలోని మిగతా అన్ని జోన్లలోనూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. అడిషనల్సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షిర్ ఇక్బాల్, గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
