ఆర్ఎస్ఎస్ తో ప్రజాస్వామ్యానికి ముప్పు..కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే 

ఆర్ఎస్ఎస్ తో  ప్రజాస్వామ్యానికి ముప్పు..కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే 

బెంగళూరు: దేశంలో ప్రజాస్వామ్యానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అతిపెద్ద ముప్పు అని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ నిధుల సేకరణపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. ఆ సంస్థ రిజిస్ట్రేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ‘మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవో, దేశంలోనే గొప్ప జాతీయవాదులమని చెప్పుకుంటారు కదా.. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా రిజిస్టర్ కండి’ అని హితవు పలికారు. పాకిస్తాన్ తరఫున లాబీయింగ్ చేసే అమెరికాతో ఆర్ఎస్ఎస్ బంధం పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ‘వారు దేశంలోని 10 కోట్ల కుటుంబాలను కలుస్తున్నారు. అసలు వారికి నిధులు ఇస్తున్నది ఎవరు? ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక సంస్థా.. లేక రాజకీయ సంస్థనా..? మోహన్ భాగవత్ స్పష్టం చేయాలని ప్రియాంక్​ ఖర్గే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.