శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న పూర్వజ్.. ఇప్పుడు జ్యోతి పూర్వజ్‌తో కలిసి లీడ్ రోల్‌లో నటిస్తూ ‘కిల్లర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎ.పద్మనాభ రెడ్డితో కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి పూర్వజ్ వివరిస్తూ ‘ఇదొక ఫిమేల్ సెంట్రిక్ సినిమా. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా సాగే కథ. ఎలాన్ మస్క్ న్యూరోలింక్‌పై పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆయన మిషన్స్‌పై చేస్తున్న ప్రయోగాలు మనిషి మీద చేస్తే ఎలా ఉంటుందనేది మెయిన్ కాన్సెప్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశాన్ని మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి కన్విన్సింగ్‌గా చూపించే చిత్రమిది. సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతూ సర్‌ప్రైజ్ చేస్తాయి. సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్‌తో పాటు చిన్న స్మైల్ కూడా వస్తుంది.
మెయిన్ పాయింట్ చూసి షాక్ అవుతారు. ఇలా కూడా సినిమా తీయొచ్చా అనుకుంటారు. నా ప్రతి సినిమాకు బౌండ్ స్క్రిప్ట్‌తో ముందుకెళ్తా. అందుకే దీన్ని 25 రోజుల్లో చిత్రీకరించా. అయితే గ్రాఫిక్ వర్క్‌కు టైమ్ ఎక్కువ పట్టింది. జ్యోతి పూర్వజ్‌ను డిఫరెంట్ రోల్స్‌లో కొత్తగా చూస్తారు. మా సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ రక్తపాతంతో కూడిన హింస లేదు. అందుకే సెన్సార్ నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది’
అని చెప్పారు.
