బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో గ్రాము ఎంతంటే?

బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో గ్రాము ఎంతంటే?

గడచిన నాలుగు రోజులుగా బంగారం రేట్లకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీపావళికి ముందు షాపింగ్ ప్లాన్ చేసుకుంటున్న తెలుగు ఫ్యామిలీలకు ఇది గుబులు పుట్టిస్తోంది. మరోవైపు వెండి రేట్లు బలహీనత అలాగే కొనసాగుతోంది. అయితే రేట్లు మరింతగా పెరగకమునుపే షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించటం బెటర్. 

అక్టోబర్ 28న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.66 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 395గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 195గా కొనసాగుతోంది. 

ALSO READ : ఏఐతో వర్ల్ పూల్ ఫ్రిజ్లు.. పది సెకన్లకు ఒకసారి తాజాదనాన్ని స్కాన్ చేసి అలర్ట్ చేస్తుంది

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 28, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 20వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.220 దగ్గర ఉంది.