న్యూఢిల్లీ:హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల సంస్థ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రూ.974 కోట్ల విలువైన డిఫెన్స్ ఆర్డర్‌ను దక్కించుకుంది. నాటో కస్టమర్‌కు 155 ఎంఎం ఆర్టిలరీ మందుగుండు సామగ్రికి అవసరమైన బేస్ బ్లీడ్ యూనిట్ల తయారీ, సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ కొత్త ఆర్డర్‌తో ప్రపంచస్థాయి ఆర్టిలరీ మందుగుండు సరఫరా విభాగంలో సంస్థ పాత్ర మరింత పెరగనుంది.
షెల్స్ ఫ్యూజ్‌లతో పాటు బేస్ బ్లీడ్ యూనిట్ల వంటి 155 ఎంఎం ఆర్టిలరీ రౌండ్ల కీలక విడిభాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకునే వ్యూహానికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని సంస్థ పేర్కొంది. దీనివల్ల సరఫరా వ్యవస్థపై పట్టు పెరగడంతో పాటు ఇతర సంస్థలపై ఆధారపడటం తగ్గుతుందని సిగ్మా సీఈవో సునీల్ కలిదిండి అన్నారు.
