చలితో వణుకుతున్న ఢిల్లీ ..మూడేండ్లలో అతి తక్కువ టెంపరేచర్రికార్డు

చలితో వణుకుతున్న ఢిల్లీ ..మూడేండ్లలో అతి తక్కువ టెంపరేచర్రికార్డు
  • మూడేండ్లలో అత్యంత కనిష్టంగా 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ చలితో వణుకుతోంది. రోజురోజుకు టెంపరేచర్ పడిపోయి.. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మంగళవారం (అక్టోబర్ 27) అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 15.3 డిగ్రీల సెల్సియస్‌‌‌‌ నమోదై రికార్డు సృష్టించింది. గడిచిన మూడేండ్లలో అక్టోబర్‌‌‌‌ నెలలో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం విశేషం. ఇంతకుముందు 2023 అక్టోబర్ 27న హస్తినలో అత్యంత తక్కువగా 15.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వివరాల ప్రకారం సఫ్దర్‌‌‌‌జంగ్​లో సాధారణం కంటే 1.9 డిగ్రీలు తక్కువగా 15.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పాలమ్ లో సాధారణం కంటే 2.3 డిగ్రీలు తక్కువగా 15.5 డిగ్రీల సెల్సియస్, ది రిడ్జ్ లో  16.2, ఆయానగర్ లో 15.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 31 డిగ్రీల సెల్సియస్‌‌‌‌గా ఉండే అవకాశం ఉందని, ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉంటుందని  వాతావరణ శాఖ తెలిపింది.