న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20)పై కొందరు పెయిడ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. 3 నెలల క్రితం ఈ20పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయని.. ఇప్పుడు అంతా సద్దుమణిగిందని తెలిపారు. దీన్నిబట్టి ఆ వ్యతిరేకత వెనుక కుట్ర ఉన్నట్లు అర్థమవుతుందని వెల్లడించారు. మంగళవారం ఆయన ఇండియన్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ కార్యక్రమంలో ఇథనాల్ వినియోగం, దానిపై వ్యతిరేకత గురించి మాట్లాడారు. 100% వరకు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు అనుమతిస్తూ కేంద్రం నిబంధనల్లో సవరణలు చేసిందని గుర్తుచేశారు.
