ఆర్టీసీ ఎన్నికల ఫలితాలపై నేడు ఈయూ కూటమి ధర్నా

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలపై నేడు ఈయూ కూటమి ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల ప్రకటన తీరుకు నిరసనగా  బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని  లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు ఈయూ కూటమి పిలుపునిచ్చింది. ఈ నెల 9 న జరిగిన ఎన్నికల్లో జాయింట్ లేబర్ కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా రీజియన్​ ఫలితాలు వెల్లడించారని ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి రీజియన్ లో 50 శాతం ప్లస్ ఒకటి ఓట్లు వస్తేనే ఆ సంఘానికి గుర్తింపు దక్కుతుందని,  ఎప్పటి నుంచో అమలవుతున్న ఈ నిబంధనను కాదని, కొత్తగా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారు గెలిచినట్లు ప్రకటించడంతో చాలా రీజియన్లలో అధికార పార్టీ అనుబంధ  టీడబ్ల్యూయూకు గుర్తింపు హోదా దక్కిందన్నారు. కార్మిక శాఖ అధికారులు పాత నిబంధనల ప్రకారమే విజేతలను ప్రకటించాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.