అమిత్‌ షాతో గవర్నర్‌ భేటీ

అమిత్‌ షాతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లా మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రెండో రోజు హస్తిన పర్యటనలో భాగంగా ఆయన హోంమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సోమవారం గవర్నర్‌ రాష్ట్రపతి, ప్రధానితోనూ భేటీ అయ్యారు.