హ్యాండ్లూమ్‌‌‌‌ హౌస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ గా కర్నాటి వజ్రమ్మ.. తొలిసారిగా తెలంగాణ మహిళకు చోటు!

హ్యాండ్లూమ్‌‌‌‌ హౌస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ గా కర్నాటి వజ్రమ్మ.. తొలిసారిగా తెలంగాణ మహిళకు చోటు!
  • జాతీయ చేనేత రంగంలో చరిత్రాత్మకం‎

గట్టుప్పల్‌‌‌‌, వెలుగు:  ఏడు దశాబ్దాల హ్యాండ్లూమ్‌‌‌‌ హౌస్‌‌‌‌ ప్రస్థానంలో తొలిసారిగా తెలంగాణకు చెందిన మహిళకు బోర్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డైరెక్టర్స్‌‌‌‌లో స్థానం దక్కగా, నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఆల్‌‌‌‌ ఇండియా హ్యాండ్లూమ్‌‌‌‌ ఫ్యాబ్రిక్స్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ కో-ఆపరేటివ్‌‌‌‌ సొసైటీ లిమిటెడ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

1955లో ప్రారంభమైన ఈ జాతీయ సంస్థలో ఇప్పటివరకు తెలంగాణకు ప్రాతినిధ్యం లభించని లోటును ఆమె పూడ్డారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఆమె ఎన్నికతో ‎ పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్‌‌‌‌  తదితర ప్రాంతాల తెలంగాణ చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయిలో విస్తృత మార్కెటింగ్ అవకాశాలు లభించేందుకు ప్రాధాన్యం సంతరించకుంది.