కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అర్నాబ్ తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలో ఎస్పీ ఆఫీసు పరిసరాలు, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్, కలెక్టర్ బంగ్లా సమీపంలో, లక్ష్మీ టాకీస్ సెంటర్‌తో పాటు మెయిన్ రోడ్లపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ మందగించింది. కూలిపోయిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు అధికారులకు విజ్ణప్తి చేశారు. మరోవైపు తుఫాను ప్రభావం కొనసాగుతున్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు, ప్రమాదకర చెట్లు, నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.
VIDEO | Cyclone Arnab: Landfall process continues, with rough seas and strong gusty winds in Machilipatnam; Beach Road closed after trees were uprooted amid heavy winds and rain. Visuals from 7:25 am. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/lib50qIvyD
— Press Trust of India (@PTI_News) October 28, 2026
