హైదరాబాద్, వెలుగు: ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు10 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో దీన్ని నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, పోలీసు విభాగాలకు చెందిన సుమారు 35 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష జరిపారు.
ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి పోలీసు క్రికెట్ టోర్నమెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని అన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నమెంట్ నిర్వహణ కోసం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లోని క్రికెట్ గ్రౌండ్ సహా మొత్తం ఎనిమిది గ్రౌండ్స్‌ను ఎంపిక చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసు క్రీడాకారులకు తెలంగాణ పోలీసు అకాడమీలో వసతి ఏర్పాట్లు చేయనున్నారు.
