- కూకట్పల్లి ప్రతిమ దవాఖానలో బాలిక మృతి
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
కూకట్పల్లి, వెలుగు : కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్లో సర్జరీకి వెళ్లిన ఒక బాలిక కన్నుమూసింది. ఘటనపై కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్లో ఉంటూ నారాయణ కాలేజ్లో చదువుతున్న సహస్ర(16)కు ఊపిరితిత్తుల సమస్య ఉండడంతో ఆమెను తల్లిదండ్రులు రెండు రోజుల కింద కూకట్పల్లి ప్రతిమ దవాఖానకు సెకండ్ఒపీనియన్ కోసం తీసుకువచ్చారు.
అయితే, ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. తర్వాత సర్జరీ చేసిన తర్వాత చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో పాప తల్లిదండ్రులు, బంధువులు డాక్టర్లే నిర్లక్ష్యంతో చంపేశారని ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సహస్ర మృతికి కారణాలు ఏమిటనే అంశంపై విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు.
