వెంటనే జీతాలియ్యండి..కంటోన్మెంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన 

వెంటనే జీతాలియ్యండి..కంటోన్మెంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన 

పద్మారావునగర్​,వెలుగు :  కంటోన్మెంట్ బోర్డు సబ్ ఏరియాల్లో డ్యూటీలు చేస్తున్న 1200 మంది కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ డిమాండ్ చేశారు. అలాగే, దీపావళి బోనస్ చెల్లించాలని బోర్డు ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ప్రతినెలా 7వ తేదీలోపు వేతనాలు ఇవ్వడం లేదని, కొత్త కాంట్రాక్ట్ మొదలై 2 నెలలు గడుస్తున్నా కార్మికులకు కనీసం గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు, పనులకు అవసరమైన సామగ్రి ఇవ్వలేదని ఆరోపించారు. తర్వాత సానిటరీ ఆండ్​ హెల్త్ సూపరింటెండెంట్ ఎం.దేవేందర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి కిషన్, ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి పాల్గొన్నారు.