- రెండేండ్ల కూతురిని చంపి దంపతుల సూసైడ్
- చావుకు ఎవరూ కారణం
- కాదని సూసైడ్ నోట్
- మృతులు పశ్చిమ బెంగాల్ వాసులు
- కేపీహెచ్బీలో విషాదం
కూకట్పల్లి, వెలుగు : పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో తమ రెండేళ్ల కూతురిని హత్య చేసి తర్వాత ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఏమీ అడగవద్దని గోడల మీద నోట్రాశారు. అయితే, ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గోపీనాథ్(31), సమత(29) పదేండ్ల కింద బెంగాల్నుంచి సిటీకి వచ్చారు. వీరు మూడేండ్లుగా కేపీహెచ్‌బీకాలనీ మూడో ఫేజ్ఎంఐజీ ఫ్లాట్స్69లో ఉంటున్నారు.
గోపీనాథ్గచ్చిబౌలిలోని ఒక హోటల్లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం నుంచి దంపతులు బయటకు రాకపోవటంతో స్థానికులు మధ్యాహ్నం 100కు డయల్ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా... భార్యాభర్తలిద్దరూ ఒకే సీలింగ్హుక్కి ఉరి వేసుకుని కనిపించారు. బెడ్‌మీద వారి రెండేండ్ల కూతురు స్నిగ్ధ విగత జీవిగా పడి కనిపించింది. ముందుగా కూతురిని ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత భార్యాభర్తలు సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు.
