ఏపీ స్థానిక ఎన్నికల్లో ఒక్కరోజే 9 FIRలు.. ఇప్పటిదాకా మొత్తం ఎన్ని కేసులంటే..!

ఏపీ స్థానిక ఎన్నికల్లో ఒక్కరోజే 9 FIRలు.. ఇప్పటిదాకా మొత్తం ఎన్ని కేసులంటే..!

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక్కరోజే 9 FIRలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ఎన్నికల సందర్భంగా మంగళవారం ( అక్టోబర్ 27 ) ఒక్కరోజే 9 FIRలు నమోదైనట్లు తెలిపారు పోలీసులు.

ఎన్నికల కోడ్ కు సంబంధించి 1177 కేసులు నమోదయ్యాయని.. ఇవాళ 67 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని తెలిపారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా 1179 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. మరో పక్క ఇప్పటిదాకా 244 FIRలు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు అధికారులు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మొత్తం 33వేల 14 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.17వేల 652 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటివరకు 9వేల 217 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లై తెలిపారు అధికారులు.

►ALSO READ | ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్‌.. యానాం దగ్గర తుఫాను తీరం దాటే అవకాశం.. టైమింగ్స్ ఇవే !