హైదరాబాద్ లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మంగళవారం ( అక్టోబర్ 27 ) నిర్వహించిన ఈ దాడుల్లో రూ. మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు సీఐ కొండల్ రావు. ఆయనతో పాటు ఓ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
పక్కా సమాచారంతో పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించిన అధికారులు సీఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే... ఏ పనికి సంబంధించి లంచం డిమాండ్ చేశాడు, ఈ విషయంలో కానిస్టేబుల్ పాత్ర ఏంటి వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐ కొండల్ రావు, కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
