హైదరాబాద్ లో క్యూర్ పరిధిలో ఇల్లు కట్టుకునే ప్లాన్ లో ఉన్నారా..? ఓసారి ఇది చూడండి..!

హైదరాబాద్ లో క్యూర్ పరిధిలో ఇల్లు కట్టుకునే ప్లాన్ లో ఉన్నారా..? ఓసారి ఇది చూడండి..!

గ్రేటర్ హైదరాబాద్, క్యూర్ పరిధిలో కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునే మధ్యతరగతి జనానికి ప్రభుత్వ నిబంధనలు శాపంగా మారుతున్నాయి. గ్రేటర్, క్యూర్ పరిధిలో వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే... ప్లాట్ వెడల్పు కనీసం 20 అడుగులు తప్పనిసరిగా ఉండాలని నిబంధన చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ ఆన్‌లైన్‌ పోర్టల్ ‘బిల్డ్‌నౌ’ లో పెట్టిన నిబంధనల కొర్రీల వల్ల కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే..సిటీ శివార్లలో చాలా అన్ అప్రూవ్డ్ లేఅవుట్లలో ప్లాట్ల వెడల్పు 12 నుంచి 25 అడుగుల లోపే ఉంటోందని... ఘాట్ కేసర్ లాంటి ఏరియాల్లో 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ.. బిల్డ్ నౌలో ఉన్న కనీసం 20 అడుగుల నిబంధన కారణంగా అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో పర్మిషన్ లేకపోవడంతో బ్యాంకులు హోమ్ లోన్స్ కూడా ఇవ్వడం ఆపేశాయని అంటున్నారు.

అర్బన్ లో ఒక రూల్.. రూరల్ లో ఒక రూల్

భావన నిర్మాణ అనుమతులకు సంబంధించి అర్బన్ లో ఒకలా, రురల్ లో ఒకలా రూల్స్ ఉండటం గమనార్హం. గ్రేటర్ పరిధిలో వంద గజాల స్థలంలో కనీసం 20 అడుగుల వెరీజియన్ లో 18 అడుగుల వెడల్పు ఉన్నా అనుమతిస్తున్నారు. రూరల్ అగ్రి రీజియన్ లో అయితే.. 18 అడుగుల  వెడల్పుతో లేఅవుట్లకు అనుమతి లభిస్తుంది.

►ALSO READ | తెలంగాణలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం

2012లో ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన జీవో 168నే చిన్న సవరణలతో కొనసాగిస్తుండగా.. ప్రస్తుతం ప్రభుత్వం యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు బాధ్యతలు HMDAకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త బిల్డింగ్ కోడ్ లో చిన్న ప్లాట్ల వెడల్పు రూల్ 20అడుగుల నుంచి కనీసం 15 అడుగులకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు రియల్టర్లు.