అర్నబ్ తుఫాను గత 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదిలింది. ప్రస్తుతం తుఫాను కేంద్రం సమీపంలోని ప్రాంతాల నుంచి ఉన్న దూరాలు. కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కు ఆగ్నేయంగా సుమారు 90 కిలోమీటర్లు. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ-నైరుతి దిశగా సుమారు 170 కిలోమీటర్లు.
మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఈశాన్య దిశగా సుమారు 170 కిలోమీటర్లు. బాపట్ల (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఈశాన్య దిశగా సుమారు 240 కిలోమీటర్లు. గోపాల్పూర్ (ఒడిశా)కు నైరుతి దిశగా సుమారు 410 కిలోమీటర్లు.
రాబోయే కొన్ని గంటల పాటు తుఫాను దాదాపు పశ్చిమ-వాయవ్య దిశగా, ఆ తర్వాత వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. తెల్లవారుజామున బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాంకు దక్షిణంగా సమీప ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరాలను అతి తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో తుఫాను గరిష్ఠంగా గంటకు 125–135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలి వేగం అప్పుడప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వరకు పెరగవచ్చు.
అర్నబ్ భూభాగంతో పరస్పర ప్రభావానికి లోనవుతోంది. తుఫాను Outer Spiral Band ఇప్పటికే భూభాగంలోకి ప్రవేశించింది. తుఫాను వేగంగా కదులుతున్నందున, ఇది ముందుగా తీరం దాటే అవకాశం ఉంది. అక్టోబర్ 28వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. తుఫాను సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
