సదాశివనగర్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఇంటి ఆడబిడ్డకు చిలుకపచ్చ చీరలు అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, గిద్ద, సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె భూమిపూజ చేశారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రతో పాటు ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా మహిళలకు చిలుకపచ్చ చీరలు అందిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కొందరికి కళ్లు మండుతున్నాయని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో విద్యుత్ కొరతను తీర్చేందుకు కొత్త సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు గడియారాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, సొసైటీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
