భీమదేవరపల్లి, వెలుగు: మెదక్– ఎల్కతుర్తి ఎన్హెచ్ 765 డీజీ పై ఉన్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామ పరిధిలోని రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. డివైడర్ ఏర్పాటు చేయకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో మూడు నెలల్లోనే సుమారు పది ప్రమాదాలు చోటుచేసుకోగా, ఆరుగురు మృతిచెందారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు.
ముఖ్యంగా రాంనగర్తోపాటు బొల్లోనిపల్లి, వంగర గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇలాంటి ఘటనలతో భయాందోళకు గురవుతున్నారు. తక్షణమే డివైడర్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
