హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు కంపెనీలు చొరవ చూపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. జిల్లాల్లో లక్ష్యాలను రెట్టింపు చేసేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలను అందించాలని ఆదేశించారు. గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ యూనిట్‌కు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని మంజూరు చేయాలని ప్రతినిధులు కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో సునీల్ కటారియా, రాకేష్ స్వామి తదితరులు ఉన్నారు.
