ఆధునిక సాంకేతికత పై రైతులకు అవగాహన కల్పించాలి : రాష్ట్ర సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

ఆధునిక సాంకేతికత పై రైతులకు అవగాహన కల్పించాలి :  రాష్ట్ర సెర్ప్ సీఈవో  దివ్య దేవరాజన్

తిర్యాణి, వెలుగు : ఆధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని (సెర్ప్) సీఈవో దివ్య దేవరాజన్​ సూచించారు. మంగళవారం ఆమె గ్రామీణ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం, సౌర విద్యుత్ వినియోగం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిర్యాణి మండలంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి సుంగాపూర్ పంచాయతీ పరిధిలోని కొలంగూడ, గుడిపేట గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

గుడిపేటలో సౌర విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వ్యవసాయ మోటార్ల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. సోలార్ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రైతులకు కలిగే ప్రయోజనాలపై వివరాలు తెలుసుకుని, ఆధునిక సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, గ్రామీణ జీవనోపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని ఆఫీసర్లకు సూచించారు. కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బి.దత్తారావు, ఎంపీడీవో నగేశ్, ఆయా గ్రామాల సర్పంచ్​లు తదితరులు పాల్గొన్నారు.