మారుతి లాభం 23 శాతం డౌన్..

మారుతి లాభం 23 శాతం డౌన్..

మొత్తం ఆదాయం రూ.53,355 కోట్లు
అమ్మకాల్లో అదరగొట్టిన కంపెనీ 

న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​ఫలితాలను ప్రకటించింది. జూలై– సెప్టెంబర్ మధ్య కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్ ) భారీగా పడిపోయింది.  ముడి సరుకుల ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో లాభం 26.36 శాతం క్షీణించి రూ.2,466 కోట్లకు పరిమితమైంది. గత సెప్టెంబర్​క్వార్టర్లో కంపెనీకి రూ.3,349 కోట్ల లాభం వచ్చింది.  ఈసారి లాభాలు పడిపోయినప్పటికీ,  అమ్మకాల్లో మాత్రం కంపెనీ సత్తా చాటింది.  

ముడి సరుకుల వ్యయం పెరగడం వల్ల సంస్థ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.3,382 కోట్ల నుంచి రూ.2,803.7 కోట్లకు తగ్గింది. మొదటి క్వార్టర్​తో పోలిస్తే ఇది 10.8 శాతం అధికం. గత ఏడాది రెండో క్వార్టర్​ లో రూ.42,344.2 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఏకంగా రూ.53,355.5 కోట్లకు ఎగబాకిందని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది.  

అమాంతం పెరిగిన ఖర్చులు..

కంపెనీ ముడి సరుకుల వ్యయం రూ.25,324.2 కోట్ల నుంచి రూ.37,488.5 కోట్లకు పెరగడంతో మొత్తం ఖర్చులు ఏకంగా రూ.50,619 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ మొత్తం ఖర్చులు రూ.39,018.4 కోట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ క్వార్టర్​లో కంపెనీ అత్యధికంగా 69,6654 వాహనాలను అమ్మగలిగింది. గత ఏడాదితో పోలిస్తే 26.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

దేశీయంగా ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో మారుతీ సుజుకి వాటా 2.2 శాతం పెరిగి 40.8 శాతానికి చేరుకుని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. దేశీయ మార్కెట్లో సంస్థ తయారు చేసిన చిన్న కార్ల అమ్మకాలు 35.9 శాతం వృద్ధి సాధించగా, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీల అమ్మకాలు ఏకంగా 68.2 శాతం పెరిగాయి.  ఈ క్వార్టర్​ ముగిసేనాటికి సుమారు రెండు లక్షల కార్ల బుకింగ్స్ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.