ఇన్వెస్ట్ తెలంగాణలో భాగం కండి.. బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు స్పీకర్ ఆహ్వానం

ఇన్వెస్ట్ తెలంగాణలో భాగం కండి.. బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు స్పీకర్ ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం గమ్య స్థానమని బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరించారు. పెట్టుబడులను ఆకర్షించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణలో భాగం కావాలని ఆహ్వానించారు. రెండు రోజుల పాటు సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్ భవనంలో) జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం– 2026 సదస్సులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రెండు రోజులు ఈ సదస్సు ముగింపులో భాగంగా మంగళవారం బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, సంక్షేమ పథకాలను పంచుకున్నారు..