పర్యాటకుల మది దోచిన గోల్కొండ.. దేశంలోనే టాప్‌‌‌‌‌‌‌‌ 10లో చారిత్రక కోటకు 7వ స్థానం

పర్యాటకుల మది దోచిన గోల్కొండ.. దేశంలోనే టాప్‌‌‌‌‌‌‌‌ 10లో చారిత్రక కోటకు 7వ స్థానం
  • ఈసారి లిస్ట్‌‌‌‌‌‌‌‌లో స్థానం కోల్పోయిన చార్మినార్‌‌‌‌‌‌‌‌
  • 2025–26లో కోటను చూసిన 16.76 లక్షల మంది దేశీ టూరిస్టులు
  • దేశంలో నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన తాజ్‌‌‌‌‌‌‌‌మహల్‌‌‌‌‌‌‌‌ 
  • ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశ పర్యాటక రంగంలో తెలంగాణకు చెందిన చారిత్రక కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల మదిని దోచుకోవడంలో గోల్కొండ కోట సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించిన జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

అయితే, నగరానికే తలమానికమైన చార్మినార్‌‌‌‌ మాత్రం ఈసారి టాప్‌‌‌‌ 10 ర్యాంకింగ్స్‌‌‌‌లో స్థానం కోల్పోయింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ పరిధిలోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) 2025–26 వార్షిక నివేదిక విడుదల చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

చార్మినార్‌‌‌‌ ప్లేస్లో హుమాయూన్ ​సమాధి
హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట ఏఎస్‌‌‌‌ఐ పరిధిలో ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 16,76,102 మంది దేశీయ పర్యాటకులు గోల్కొండను సందర్శించారు. 2024–25లో 15.63 లక్షల మంది వచ్చారు. ఇక రాష్ట్రానికి వచ్చే విదేశీయుల ఫస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌ కూడా గోల్కొండనే కావడం విశేషం. గతేడాది 15,958 మంది విదేశీయులు రాగా, ఈసారి 17,304 మంది తరలొచ్చారు. చార్మినార్‌‌‌‌ను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య గతేడాది 13,43,503 నుంచి ఈసారి 12,83,678కి పడిపోయింది.

ఢిల్లీ హుమాయూన్ సమాధిని 13.28 లక్షల మంది సందర్శించడంతో చార్మినార్ టాప్‌‌‌‌ 10 రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 9,562 నుంచి 8,145కు తగ్గింది. వరంగల్ కోటను దర్శించిన దేశీయ పర్యాటకులు 1,06,447 నుంచి 1,02,978కి తగ్గారు. అయితే, విదేశీ పర్యాటకుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. 280 నుంచి 336కి పెరిగింది. హైదరాబాద్ సర్కిల్‌‌‌‌లో ఓవరాల్‌‌‌‌గా దేశీయ పర్యాటకుల సంఖ్య 30.13 లక్షల నుంచి 30.62 లక్షలకు చేరగా.. విదేశీ పర్యాటకులు 25,800 నుంచి 25,785కు స్వల్పంగా తగ్గారు.

తాజ్‌‌‌‌మహల్‌‌‌‌కు 22.48 లక్షల మంది..
దేశవ్యాప్తంగా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని రక్షిత టికెటెడ్ కట్టడాలను గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 5.37 కోట్లు మంది స్వదేశీ పర్యాటకులు, 22.48 లక్షలు మంది విదేశీయులు సందర్శించారు. 53,50,508 మంది దేశీ టూరిస్టులను ఆకర్షించిన ఆగ్రాలోని తాజ్‌‌‌‌మహల్ దేశంలోనే నంబర్​వన్​గా నిలిచింది.

ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం 34,20,764 మందితో రెండో స్థానంలో, ఢిల్లీలోని కుతుబ్ మినార్ 31,50,879 మందితో మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ ఎర్రకోట 20,91,801 మంది, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు 18,49,209  మంది, యూపీలోని ఆగ్రా కోటను 16,90,243 మంది సందర్శించారు.

రాజస్థాన్‌‌‌‌కు చెందిన చిత్తోర్‌‌‌‌గఢ్ కోట 16,01,053 మందితో 8వ స్థానం(గోల్కొండ తర్వాత), ఒడిశాలోని ఉదయగిరి, ఖండగిరి గుహలు 14,61,228 మందితో  9వ స్థానం, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి 13,28,716  మందితో 10వ స్థానంలో నిలిచాయి. ఈ 10 కట్టడాలు పోనూ దేశంలోని మిగతా అన్ని స్మారక చిహ్నాలను కలిపి 3,01,40,439 మంది దేశీయ పర్యాటకులు వీక్షించారు. 

విదేశీ పర్యాటకుల విషయానికొస్తే.. 
ఇక్కడ కూడా తాజ్‌‌‌‌మహలే నంబర్ వన్ చాయిస్‌‌‌‌గా నిలిచింది. దేశానికి వచ్చిన మొత్తం విదేశీయుల్లో దాదాపు నాలుగో వంతు మంది.. అంటే 5,48,906 మంది ఈ కట్టడాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆగ్రా కోటకు 2,27,600 మంది, కుతుబ్ మినార్‌‌‌‌కు 2,25,274 మంది వచ్చారు.

హుమాయూన్ సమాధిని 1,65,004 మంది, బిహార్‌‌‌‌లోని నలంద తవ్వకాల సైట్ ను 1,03,864  మంది టూరిస్టులు సందర్శించారు. టాప్​టెన్​ప్రదేశాలు మినహా దేశంలోని ఇతర చారిత్రక ప్రాంతాలను చూసేందుకు 5,84,452 మంది విదేశీయులు వచ్చినట్లు ఏఎస్ఐ రిపోర్ట్​చెబుతోంది.