సికింద్రాబాద్, వెలుగు: పంజాబ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. అభిరత్ రెడ్డి (97), రాహుల్ రాధేశ్ (72 బ్యాటింగ్) రాణించడంతో.. మంగళవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 193/2 స్కోరు చేసింది. రాహుల్‌తో పాటు హిమతేజ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
తన్మయ్ అగర్వాల్ (2) నిరాశపర్చాడు. అంతకుముందు 289/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 124.5 ఓవర్లలో 431 రన్స్‌కు ఆలౌటైంది. సలీల్ అరోరా (151) భారీ సెంచరీ సాధించగా, రమన్‌దీప్ సింగ్ (52), ఉమేశ్ యాదవ్ (37 నాటౌట్) రాణించారు.
