అభిషేక్ విధ్వంసం .. 38 బాల్స్లో 113 రన్స్.. మూడో టీ20లో ఇండియా ఘన విజయం

అభిషేక్ విధ్వంసం .. 38 బాల్స్లో 113 రన్స్.. మూడో టీ20లో ఇండియా ఘన విజయం
  •  6 వికెట్ల తేడాతో ఓడిన కివీస్‌‌‌‌ 
  •  ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ 3–0తో టీమిండియా సొంతం
  •  రాణించిన వైభవ్‌‌‌‌ సూర్యవంశీ 

వెల్లింగ్టన్‌‌‌‌:  38 బాల్స్‌‌‌‌.. 9 ఫోర్లు.. 11 సిక్సర్లు.. 113 రన్స్‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ శర్మ విధ్వంసం ఇది. పవర్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌కు పర్యాయపదంగా మారిన అభిషేక్‌‌‌‌ 15 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ, 38 బాల్స్‌‌‌‌లో సెంచరీతో కివీస్‌‌‌‌ బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టించాడు. బాల్‌‌‌‌ వేబాయడానికి కూడా భయపడిన హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ బౌలర్లపై వండర్‌‌‌‌ కిడ్‌‌‌‌ వైభవ్‌‌‌‌ సూర్యవంశీ (19 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 45) కూడా పిడుగులా విరుచుకుపడటంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో కివీస్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరో రెండు మిగిలి ఉండగానే 3–0తో కైవసం చేసుకుంది. 

దాంతో న్యూజిలాండ్‌‌‌‌ గడ్డపై టీ20 సిరీస్‌‌‌‌ విజయాల హ్యాట్రిక్‌‌‌‌ను పూర్తి చేసింది. 2020, 2022లోనూ టీమిండియా వరుసగా 5–0, 1–0తో సిరీస్‌‌‌‌లను సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌ ఓడిన న్యూజిలాండ్‌‌‌‌ 20 ఓవర్లలో 198/3 స్కోరు చేసింది. డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (52 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 89 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. 4 రన్స్‌‌‌‌ వద్ద టిమ్‌‌‌‌ సీఫెర్ట్‌‌‌‌ (2) ఔట్‌‌‌‌ చేసిన ఇండియా బౌలర్లు ఆ తర్వాత ఫెయిలయ్యారు. దీన్ని ఆసరాగా తీసుకున్న మిచెల్‌‌‌‌.. ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌ (25 బాల్స్‌‌‌‌లో 5 సిక్స్‌‌‌‌లతో 40)తో రెండో వికెట్‌‌‌‌కు 86, గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (17)తో మూడో వికెట్‌‌‌‌కు 33, బేవాన్‌‌‌‌ జాకబ్స్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 39 నాటౌట్‌‌‌‌)తో నాలుగో వికెట్‌‌‌‌కు 75 రన్స్‌‌‌‌ జోడించి కివీస్‌‌‌‌కు భారీ స్కోరు అందించాడు. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, నితీష్‌‌‌‌ కుమార్‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌ తీశారు. 

హిట్టింగ్‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌..

ఛేజింగ్‌‌‌‌లో ఇండియా 13.2 ఓవర్లలోనే 199/4 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ సృష్టించిన పరుగుల సునామీకి కివీస్‌‌‌‌ బౌలర్లకు బాల్‌‌‌‌ ఎలా వేయాలో కూడా అర్థంకాని పరిస్థితుల్లోకి వెళ్లారు. రెండో ఎండ్‌‌‌‌లో వైభవ్‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో ఛేజింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ మొత్తం సిక్సర్ల ‘హిట్టింగ్‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌’గా మారింది. ఫలితంగా ఫ్యాన్స్‌‌‌‌ ఫుల్‌‌‌‌ ఎంజాయ్‌‌‌‌ చేయడంతో పాటు చాలా రికార్డులు బద్దలయ్యాయి. తొలి ఓవర్‌‌‌‌లో వైభవ్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిస్తే అభిషేక్‌‌‌‌ 6, 6, 5 వైడులతో 26 రన్స్‌‌‌‌ రాబట్టాడు. రెండో ఓవర్‌‌‌‌లో 6, 6, 4 దంచిన అభిషేక్‌‌‌‌ తర్వాతి ఓవర్‌‌‌‌లోనూ 4, 6, 4 రిపీట్‌‌‌‌ చేశాడు. వైభవ్‌‌‌‌  సిక్స్‌‌‌‌తో 21 రన్స్‌‌‌‌ వచ్చాయి. నాలుగో ఓవర్‌‌‌‌లో 4, 6తో అభిషేక్‌‌‌‌ 15 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఆ వెంటనే ఫోర్‌‌‌‌తో ఈ ఓవర్‌‌‌‌లో 20 రన్స్‌‌‌‌ రాబట్టాడు. ఐదో ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 6, 4, 4తో ఇండియా స్కోరు వందకు చేరింది. 

ఆరో ఓవర్‌‌‌‌లో సూర్యవంశీ 4, 4, 4, 6తో 18 రన్స్‌‌‌‌ రాబట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 118/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 6, 6 కొట్టినా.. 8వ ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కు మ్యాట్‌‌‌‌ ఫిషర్‌‌‌‌ (1/23).. వైభవ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. ఫలితంగా తొలి వికెట్‌‌‌‌కు 133 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది.  ఇదే ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 6, 6, శాంసన్‌‌‌‌ (18) 4తో 23 రన్స్‌‌‌‌ వచ్చాయి. 9వ ఓవర్‌‌‌‌లో శాంట్నర్‌‌‌‌ ఆరు రన్స్‌‌‌‌తో సరిపెట్టాడు. 10వ ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో 38 బాల్స్‌‌‌‌లో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్‌‌‌‌ 6, 4 కొట్టి ఔటయ్యాడు. రెండో వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. పది ఓవర్లలో స్కోరు 178/2కు చేరింది. ఆ వెంటనే ఏడు బాల్స్‌‌‌‌ తేడాలో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (5), శాంసన్‌‌‌‌ ఔటైనా.. తిలక్‌‌‌‌ వర్మ (1 నాటౌట్‌‌‌‌), నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ (4 నాటౌట్‌‌‌‌) 40 బాల్స్‌‌‌‌ మిగిలి ఉండగానే ఈజీగా గెలిపించారు. జెమీసన్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. అభిషేక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం ఆక్లాండ్‌‌‌‌లో జరుగుతుంది. 

సంక్షిప్త స్కోర్లు

 న్యూజిలాండ్‌‌‌‌: 20 ఓవర్లలో 198/3 (మిచెల్‌‌‌‌ 89*, అలెన్‌‌‌‌ 40, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ 1/36). ఇండియా: 13.2 ఓవర్లలో 199/4 (అభిషేక్‌‌‌‌ 113, వైభవ్‌‌‌‌ 45, జెమీసన్‌‌‌‌ 2/45).
 
1ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ (11). విరాట్‌‌‌‌ (10)ను అధిగమించాడు. ఓవరాల్‌‌‌‌గా క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌ (22), బాబర్ ఆజమ్‌‌‌‌ (13) ముందున్నారు. 

1టీ20ల్లో ఫాస్టెస్ట్‌‌‌‌గా వంద రన్స్‌‌‌‌ (5 ఓవర్లు) చేసిన తొలి జట్టు ఇండియా. రొమేనియా (5.2), సౌతాఫ్రికా (5.3), ఆస్ట్రేలియా (5.3) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
1 పవర్‌‌‌‌ప్లేలో అత్యధిక రన్స్‌‌‌‌ (118)  చేసిన తొలి జట్టుగా టీమిండియా వరల్డ్‌‌‌‌ రికార్డు. 

1ఎదుర్కొన్న తొలి బాల్‌‌‌‌కే ఎక్కువ సార్లు సిక్స్‌‌‌‌ కొట్టిన తొలి బ్యాటర్ అభిషేక్‌‌‌‌ (8). 
1అతి తక్కువ బాల్స్‌‌‌‌లో 50 రన్స్‌‌‌‌ (2.2 ఓవర్లు) చేసిన తొలి టీమ్‌‌‌‌ ఇండియా.