దిల్షాన్‌‌‌‌ మధుషనక 5/34.. పాక్పై లంక గెలుపు..

 దిల్షాన్‌‌‌‌ మధుషనక 5/34.. పాక్పై లంక గెలుపు..

లాహోర్‌‌‌‌: బౌలింగ్‌‌‌‌లో దిల్షాన్‌‌‌‌ మధుషనక (5/34), బ్యాటింగ్‌‌‌‌లో కమింద్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (62 నాటౌట్‌‌‌‌) రాణించడంతో.. ముక్కోణపు వన్డే సిరీస్‌‌‌‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఇంగ్లండ్‌‌‌‌ ఆశలు గల్లంతయ్యాయి.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో.. టాస్ ఓడిన పాక్‌‌‌‌ 25.3 ఓవర్లలో 110 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (29) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. హసన్‌‌‌‌ నవాజ్‌‌‌‌ (17), షాహిన్‌‌‌‌ ఆఫ్రిది (15)తో సహా మిగతా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కు పరిమితమయ్యారు.

తర్వాత లంక 18.1 ఓవర్లలో 114/2 స్కోరు చేసి నెగ్గింది. మెండిస్‌‌‌‌తో పాటు పవర్‌‌‌‌ రత్నాయకే (23 నాటౌట్‌‌‌‌), అవిష్క ఫెర్నాండో (16) రాణించారు. దిల్షాన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. శనివారం జరిగే ఫైనల్లో లంక.. పాకిస్తాన్‌‌‌‌తో తలపడుతుంది.