చెన్నై సూపర్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్గా మోర్కెల్

చెన్నై సూపర్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్గా మోర్కెల్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–2027 సీజన్‌‌‌‌ కోసం చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ జట్టు తమ సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌లో కీలక మార్పులు చేసింది. ఫ్రాంచైజీ తరఫున సుదీర్ఘకాలం ఆడిన మాజీ ప్లేయర్లు అల్బీ మోర్కెల్‌‌‌‌ను అసిస్టెంట్‌‌‌‌ కోచ్‌‌‌‌గా, మోహిత్‌‌‌‌ శర్మను బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా నియమించింది. ఇంగ్లండ్‌‌‌‌ మాజీ క్రికెటర్ గారెత్‌‌‌‌ బాటి కూడా అసిస్టెంట్‌‌‌‌ కోచ్‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. 

ఫీల్డింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ జేమ్స్‌‌‌‌ ఫాస్టర్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ కోచ్‌‌‌‌ శ్రీధర్‌‌‌‌ శ్రీరామ్‌‌‌‌ను కొనసాగించారు. ఐదుసార్లు చాంపియన్‌‌‌‌గా నిలిచిన సీఎస్కే ఈ వివరాలను సోషల్‌‌‌‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా జహీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ బాధ్యతలు స్వీకరించగా ఇప్పుడు పూర్తి కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ను సిద్ధం చేసింది.