- భయంతో రోడ్లపైకి పరుగు తీసిన జనం
హైదరాబాద్ సిటీ/గండిపేట, వెలుగు: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, కేశవస్వామి నగర్, లంగర్హౌస్తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9.15 గంటల నుంచి 10.25 గంటల మధ్య ఒక్కసారిగా భారీ శబ్ధాలు వచ్చాయి. 5 నుంచి 10 సెకన్ల పాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగు తీశారు. మరోవైపు భూగర్భంలో నీరు, గాలి ఒత్తిడి పెరగడం వల్ల ఈ తరహా ప్రకంపనలు సంభవించి ఉండవచ్చని ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు భావిస్తున్నారు.
ఇంకోవైపు ఆ ప్రాంతాల చుట్టుపక్కల జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో భాగంగా బండరాళ్లను పగులగొట్టడానికి ఎక్కడైనా అనధికారికంగా భారీ బ్లాస్టింగ్‌లు జరిపారా అని ఆరా తీస్తున్నట్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. స్వల్పంగా భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రికార్డుల్లో నమోదైనట్లు సమాచారం వచ్చిందని రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు తెలిపారు.
