అమ్మ రమ్మందని నెల కష్టమంతా ఫ్లైట్ టికెట్ కు పెట్టాడు.. ట్రెండవుతున్న బీహార్ కూలీ స్టోరీ

అమ్మ రమ్మందని నెల కష్టమంతా ఫ్లైట్ టికెట్ కు పెట్టాడు.. ట్రెండవుతున్న బీహార్ కూలీ స్టోరీ

బిహారీలు పని కోసం ఎలా పరుగెడతారో తెలిసిందే. మనం చాలా తక్కువ అనుకునే జీతానికి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి పనిచేస్తారు. మన దేశంలో ఆ కూలీలు లేని రాష్ట్రం ఉండదంటే అతిశయోక్తి కాదు. తక్కువ జీతానికి పనిచేస్తూ.. వీలైనంత తక్కువ ఖర్చు చేస్తూ నెలకు ఎంతో కొంత తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. అయితే ఒక పిల్లవాడు నెలంతా చేస్తే వచ్చిన డబ్బుతో ఫ్లైట్ టికెట్ కొని తన స్వగ్రామానికి వెళ్లాడు. ఆ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.

బీహార్ కు చెందిన సత్యరోహన్ కుమార్ అనే యువకుడు చెన్నైలో పనిచేస్తున్నాడు. చెన్నై నుంచి పాట్నా వెళ్లేందుకు తన నెల జీతం అంతా ఖర్చు చేసి టికెట్ తీసుకున్నాడు. ఊర్లో ఛత్ పూజా ఉండటంతో జీతం మొత్తం ఖర్చు చేసి వెళ్లటంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అమ్మ పండగకు రమ్మందని..

ఛత్ పూజ ఉన్నందున పండగకు రావాలని తన కొడుకుకు కబురు పంపింది అమ్మ. అమ్మ పిలుపుతో ఎంత ఖర్చయినా పర్లేదు అని ఫ్లైట్  టికెట్ కొనేందుకు సిద్ధమయ్యాడు. అమ్మ పిలిస్తే ఏ కొడుకైనా ఇంటికి వెళ్లకుండా ఉంటాడా..? ఇంటికి దూరంగా ఉండటాన్ని పోల్చవద్దు కదా అంటూ ఇన్ స్టాలో పంచుకున్నాడు. 

మాఫియా3170  అకౌంట్ లో ఫ్లైట్ లో వెళ్తున్న వీడియో క్లిప్ షేర్ చేశాడు. అమ్మ పిలిస్తే వెళ్లకుండా ఉంటామా.. అంటూ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

వలస కార్మికులు వందల, వేల కిలోమీటర్ల దూరం వెళ్లి పనులు చేస్తుంటారు. నెలలు నెలలుగా కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉంటుంటారు. వాళ్లు కొంత సంపాదించానని ఎప్పుడు భావిస్తారో.. రాను పోను ఖర్చులు భరిస్తామనే భరోసా ఉన్నపుడే తమ ఊళకు వెళ్తుంటారు. అలాంటిది టికెట్ కోసం నెల జీతాన్ని ధారపోయటం చర్చనీయాంశంగా  మారింది. 

సోషల్ మీడియాలో భిన్న వాదనలు

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అందుకే కదా వలస వెళ్లింది.. అలాంటిది అన్ని వేలు పోసి ఫ్లైట్ జర్నీ అవసరమా అంటున్నారు కొందరు. ఆ డబ్బులు ఫ్యామిలీకి ఉపయోగపడేవి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే కొందరు సత్యారోహన్ కు మద్ధతుగా నిలుస్తున్నారు. అతని కష్టం అతని డబ్బు.. నిర్ణయం తీసుకునే హక్కు అతనికి ఉంది అంటున్నారు. 

అమ్మ పిలిచినపుడు ఏ కొడుకైనా డబ్బును లెక్కలేసుకుంటూ కూర్చోడు.. అమ్మ కోసం అది ఎంతటి  ఖర్చైనా వెనకాడడు. సత్యరోహన్ కూడా అదే విధంగా    తల్లి పిలుపు మేరకు.. ఎంత వీలైతే అంత తొందరగా  చేరుకోవాలనే కోరికతో తన నెలజీతాన్ని ఫ్టైట్ టికెట్ కు కేటాయించాడు అని అంటున్నారు. 

సూర్యరోహన్  నిర్ణయం స్వంత్రత్ర నిర్ణయమని చాలా మంది పొగుడుతున్నారు. అతని డిసిషన్ అతడు తీసుకోనివ్వండి. మధ్యలో మీరెవరు  అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. 

ఈ స్టోరీ కొందరికి గుండెలకు తాకినట్లు చెబుతున్నారు. తన ఇంటికి తాను వచ్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలని పోస్ట్ చేస్తున్నారు.