యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. యూపీలోని 11 స్థానాలకు గాను 8 స్థానాల ఫలితాలు వచ్చాయి. వీటిలో బీజేపీ 5, ఎస్పీ 3 స్థానాలను గెలుచుకున్నాయి. బీహార్లోని ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలలో నాలుగు స్థానాల ఫలితాలు కూడా ప్రకటించారు. కర్నాటలో నాలుగు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 3, జేడియూ1 గెలుచుకున్నాయి.
ఉత్తర ప్రదేశ్ ఫలితాల వివరాలు.
ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం11 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజేతలను ప్రకటించగా అందులో బీజేపీ 5 స్థానాలు, ఎస్పీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 3 స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిలో బీజేపీ ఒక స్థానంలో, ఎస్పీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో, బీజేపీ ఉపాధ్యాయుల కోటా స్థానాన్ని కోల్పోయింది. దీంతోపాటు గ్రాడ్యుయేట్ఎమ్మెల్యే స్థానంలో కూడా వెనుకబడి ఉంది.
ALSO READ : ఆర్ఎస్ఎస్ తో ప్రజాస్వామ్యానికి ముప్పు..కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే
గోరఖ్పూర్ స్థానంలో బీజేపీ ఆధిక్యం సాధించింది. బీజేపీ ఇప్పటివరకు మీరట్ టీచర్ ఎమ్మెల్సీ, మీరట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, బరేలీ టీచర్ ఎమ్మెల్సీ, లక్నో టీచర్స్ ఎమ్మెల్సీ, ఆగ్రా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది. సమాజ్ వాదీ పార్టీ వారణాసి టీచర్ ఎమ్మెల్సీ, ఆగ్రా టీచర్ ఎమ్మెల్సీ,ఝాన్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది. వారణాసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ , లక్నో గ్రాడ్యుయేట్ స్థానాలలో కూడా ఎస్సీ ఆధిక్యంలో ఉంది.
