హోటల్స్ కు వెళ్లినపుడు ఎక్కడెక్కడి కోపమో వెయిటర్ల మీద, చిన్న చిన్న ఉద్యోగుల మీద చూపిస్తుంటారు చాలా మంది. ఈ గెస్టు కూడా అలాంటి పనే చేశాడు. అది కూడా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడటం రానందుకు కొట్టాడట. ఇది పెద్ద వివాదం అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ ఇష్యూపై హోటల్ తాజ్ ఏం నిర్ణయం తీసుకుందో.. ఆ వెయిటర్ బ్యాగ్రౌండ్ చూసి ఏం చేసిందో తెలుసుకుందాం.
ఆగ్రాలోని తాజ్ హోటల్ లో జరిగింది ఈ ఘటన. వెయిటర్ ని అకారణంగా కొట్టిన గెస్టును జీవితకాలం నిషేధిస్తూ తాజ్ నిర్ణయం తీసుకుంది. అయితే వెయిటర్ గురించి విషయమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన తర్వాత గెస్టును లైల్ లాంగ్ బ్లాక్ లిస్టులో పెట్టినట్లు పరితోష్ లధాని, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (SLMG బెవరేజెస్) అనే లింక్డిన్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి షేర్ చేశారు.
వెయిటర్ పేరు కాంతి. తాజ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా సేవ చేస్తున్నాడు. అతడికి ఇంగ్లీష్ ప్రాపర్ గా మాట్లాడటం రాదు. అయితే గెస్టుతో కాస్త మిస్ కమ్యూనికేషన్ అయ్యిందనీ.. దానికే చెంపదెబ్బ కొట్టినట్లు పరితోష్ పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేసుకునే వ్యక్తిని కొట్టినట్లు పేర్కొన్నాడు.
అయితే ఈ ఘటనపై వెయిటర్ హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయలేదట. ఏం జరిగిందని అడిగితే అప్పుడు చెప్పాడట. అయితే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు..? అని అడగగా.. ఆ వెయిట్ చెప్పిన సమాధానం విని గుండె పగిలిందని పరితోష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
నేను చాలా పేద వ్యవసాయిక కుటుంబం నుంచి వచ్చాను. ఆగ్రా కు దగ్గరలో చిన్న గ్రామం మాది. తాజ్ హోటల్ లో పనిచేయడం నా డ్రీమ్. వివాదాల్లో చిక్కుకుంటే ఉద్యోగం పోతుందేమోననే భయంతో చెప్పలేదని తెలిపాడు.
ఒక్కసారి ఆలోచించండి. ఆ జాబ్ తనకు ఎంత అవసరమో. లేదంటే అంత అవమానానికి గురై ఎందుకు మౌనంగా ఉంటాడు. అలాంటి వారికి అన్యాయం జరిగితే ఏ నాయకుడు కూడా ఊరుకోడు.. అంటూ మేనేజర్ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 5,600 రియాక్షన్స్ తో లింక్డిన్ యూజర్ల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. అయితే ఆ గెస్టుపై ఫార్మల్ గానైనా కేసు పెడితే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. కొందరేమో.. ఆ గెస్టును పబ్లిక్ గా ఎందుకు ఆయన డీటెయిల్స్ చెప్పడం లేదు అని ప్రత్నిస్తున్నారు.
గెస్టుల సాటిస్ఫాక్షనే ముఖ్యమనుకే మేనేజర్లు, హోటల్ యాజమాన్యాలు ఉండే ఈ రోజుల్లో ఉద్యోగుల గౌరవాన్ని కాపాడిన మేనేజర్ ను అభినందిస్తున్నారు.
