బంజారాహిల్స్ ఎస్సై విజయ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వివాదంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలతో 2026 అక్టోబర్ 28న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విజయ్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
బంజారాహిల్స్ లో ఒక ఇంటి యజమానికి, కిరాయికి ఉన్న వారి మధ్య జరిగిన వివాదంలో ఒకరికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించినట్లు విజయ్ పై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఒక వర్గాన్ని జైలుకు పంపించగా.. జైలు నుంచి బయటికి వచ్చిన వారు విజయ్ లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో ప్రూఫ్ ఏసీబీ అధికారులకు అందజేసిన బాధితులు.. ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు.
దీంతో ఎస్సై విజయ్ పై నిఘా ఉంచిన అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
