ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

 ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

 ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026 అక్టోబర్ 28న వివిధ శాఖలకు బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఐఏఎస్ దాన కిశోర్ ను గవర్నర్ చీఫ్ సెక్రటరీగా రీ అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

జయేష్ రంజన్‌కు ఈఎఫ్‌ఎస్‌ అండ్‌ టీ శాఖ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. నవీన్ మిట్టల్‌కు రెవెన్యూ, ఆర్‌అండ్‌ఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌ఎస్‌ఏడీ శాఖల బాధ్యతలు అప్పగించారు.

శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఎ. వాణీ ప్రసాద్‌కు స్పోర్ట్స్, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్ బొజ్జాకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు ఇచ్చారు. ఐలంబార్తి కే రవాణా శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. 

సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్‌ఎండీఏ, మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి సంస్థల బాధ్యతలు అందజేశారు. శృతి ఓజాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ బాధ్యతలు ముషారఫ్ అలీ ఫారూఖీ కి ఇచ్చారు. 

 డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణకు డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. జితేష్ వి. పాటిల్‌కు టీజీఎస్పీడీసీఎల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల అదనపు నిర్వహణను అప్పగించారు.