ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ కోసం సపోర్ట్ స్టాఫ్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌లో జట్టుకు ప్రత్యేకంగా ఎలాంటి బ్యాటింగ్ కోచ్ (Batting Coach) ఉండరని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Viswanathan) అధికారికంగా స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేక నిరాశపరిచిన సీఎస్కే.. కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్‌తో (Zaheer Khan) పాటు సరికొత్త ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
మా కోచింగ్ స్టాఫ్ పూర్తి కాంబినేషన్ కుదిరింది: సీఎస్కే సీఈఓ
వచ్చే (IPL 2027) సీజన్‌కు బ్యాటింగ్ కోచ్‌ను నియమిస్తారా అని మీడియా (స్పోర్ట్‌స్టార్) ప్రశ్నించగా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. మా కోచింగ్ స్టాఫ్ నియామకాలు పూర్తయ్యాయి.. నిన్న ప్రకటించిన కోచింగ్ బృందమే రాబోయే సీజన్‌లో మా బ్యాక్‌రూమ్ టీమ్‌గా వ్యవహరిస్తుంది. కొత్తగా మేము ఎలాంటి బ్యాటింగ్ కోచ్‌ను నియమించడం లేదని తేల్చి చెప్పారు. 2018 నుంచి 8 సంవత్సరాల పాటు సీఎస్కే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన మైకేల్ హస్సీకి (Mike Hussey) ఫ్రాంచైజీ ఇటీవల వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. హస్సీ నిష్క్రమణ తర్వాత కొత్త వారిని తెస్తారని అనుకున్నప్పటికీ, చెన్నై మేనేజ్‌మెంట్ కోచింగ్ రెస్పాన్సిబిలిటీస్‌ను ప్రస్తుత స్టాఫ్ షేర్ చేసుకోవాలని చెప్పింది.
ఐపీఎల్ 2027 కోసం సీఎస్కే కొత్త కోచింగ్ ప్యానెల్:
* హెడ్ కోచ్:
జహీర్ ఖాన్ (Zaheer Khan) - స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో.
* అసిస్టెంట్ కోచ్‌లు:
ఆల్బీ మోర్కెల్ (Albie Morkel)
గారెత్ బాటీ (Gareth Batty)
బౌలింగ్ కోచ్: మోహిత్ శర్మ (Mohit Sharma)
రిటైన్ కోచ్‌లు:
అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్, ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్.
ALSO READ : ఆఫీస్ వర్క్ పక్కనబెట్టి SA vs AUS మ్యాచ్ చూస్తూ కెమెరాకు దొరికిన ఉద్యోగులు..
గత 18 ఏళ్లుగా జట్టుతో ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో పాటు మైక్ హస్సీ, ఎరిక్ సిమన్స్, రాజీవ్ కుమార్, గ్రెగ్ కింగ్, టామీ సిమ్సెక్ వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న సపోర్ట్ స్టాఫ్‌ను వీడటం ద్వారా సీఎస్కే మేనేజ్‌మెంట్ రాబోయే సీజన్ కోసం పూర్తి స్థాయిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
