భారతీయ ఆరాధ్య ఇతిహాసం 'రామాయణం' ఇప్పుడు అంతర్జాతీయ సినీ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇంగ్లీష్ వెర్షన్ ప్రీమియర్ లేటెస్ట్ గా లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది.
లాస్ ఏంజిల్స్‌లో ప్రత్యేక ప్రదర్శన..
అక్టోబర్ 27న అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లోని డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు చిత్రబృందంతో పాటు అంతర్జాతీయ సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. 3డీ ఫార్మాట్‌లో ప్రదర్శించిన ఈ చిత్రానికి తొలి స్పందనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రణ్‌బీర్ నటన, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతంపై పలువురు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. . భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కిస్తున్న తీరు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే కథనం, భావోద్వేగాల విషయంలో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
50 వేల స్క్రీన్లపై రామాయణం?
ఈ చిత్రాన్ని 100కు పైగా దేశాల్లో 50 వేల స్క్రీన్లపై విడుదల చేయాలనే భారీ లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. ఈ గణాంకాలకు అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కథలకు పెరుగుతున్న ఆదరణ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. డీఎన్‌ఈజీ, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించి సంగీత .
►ALSO READ | OTT Fantasy Thriller: ఓటీటీలోకి తెలుగు ఫాంటసీ థ్రిల్లర్.. పిల్లలకు పర్ఫెక్ట్ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్..
నవంబర్ 5న తొలి భాగం విడుదల..
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ విడుదల కానున్న ఈ మొదటి భాగం 2026 నవంబర్ 5న థియేటర్లలోకి రానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ధర్మం, త్యాగం, ధైర్యం, చెడుపై మంచి సాధించే విజయాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకుఈ చిత్రం పరిచయం చేయనుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ మహాగాథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..
