Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత నయా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 (3rd T20I) మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే 113 పరుగుల మెరుపు శతకం సాధించిన అభిషేక్, ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్- వన్ స్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు సౌతాఫ్రికా యంగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (Marco Jansen) కిరాక్ ప్రదర్శనతో టెస్టుల్లో భారత్ దిగ్గజ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు ఏళ్ల సుదీర్ఘ ఆధిపత్యానికి తెరదించాడు.
మళ్లీ నెంబర్-1గా అభిషేక్ శర్మ:
న్యూజిలాండ్‌పై సాధించిన విధ్వంసకర సెంచరీ అభిషేక్ శర్మను మళ్లీ అగ్రపీఠంపై కూర్చోబెట్టింది. ఇక తన టీమిండియా సహచరుడు ఇషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టి మరోసారి మొదటి స్థానాన్ని అభిషేక్ హస్తగతం చేసుకున్నాడు. జూలై 2025లో తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ సాధించిన అభి, ఇప్పుడు మళ్లీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన జెండా పాతాడు.
నాలుగేళ్ల తర్వాత రవీంద్ర జడేజాకు షాక్:
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 85 రన్స్ చేయడంతో పాటు 5 వికెట్ల ఘనత సాధించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ డబుల్ ధమాకా సృష్టించాడు. గత నాలుగేండ్లకు పైగా టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజాను వెనక్కి నెట్టి వేసి, జాన్సెన్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే మిచెల్ స్టార్క్‌ను అధిగమించి ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ జాన్సెన్ ప్రపంచ నంబర్-1 బౌలర్‌గా అవతరించాడు.
►ALSO READ | వైభవ్ సూర్యవంశీకి షాక్!.. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!
ఐసీసీ ర్యాంకింగ్స్ అప్‌డేట్స్:
* వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నెంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకోగా, విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, రోహిత్ శర్మ 4వ స్థానంలోనే కొనసాగుతున్నారు.
* టెస్టుల్లో బవుమా: ఆస్ట్రేలియాపై అద్భుతమైన బ్యాటంగ్ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా 4 స్థానాలు ఎగబాకి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నాడు.
