నారాయణపూర్ లో ఉద్రిక్తత.. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు 

నారాయణపూర్ లో ఉద్రిక్తత.. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నారాయణపూర్ గ్రామంలో భూసేకరణ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది . గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో సర్వే కోసం వచ్చిన SDC అధికారులను అడ్డుకున్నారు గ్రామస్తులు. గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించేవరకు సర్వే వద్దంటూ నినాదాలు చేశారు గ్రామస్తులు.

నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించేవరకు ఉరుకోమంటూ నినాదాలు చేస్తూ సర్వే కోసం వచ్చిన అధికారులను వెనక్కి పంపారు అధికారులు. గ్రామంలోని స్కూల్ దగ్గరి నుంచే అధికారులను వెనక్కి పంపించారు గ్రామస్తులు. 

ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకులను అడ్డుకొని.. వారి దగ్గరి  నుంచి పురుగుల మందు డబ్బాలను లాక్కున్నారు పోలీసులు.

గ్రామంలో తలపెట్టిన చెరువుకట్ట అలైన్మెంట్, భూసేకరణ ప్రక్రియ గత కొంతకాలంగా వివాదానికి కారణమవుతోంది. అధికారులు కేవలం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురవుతున్న కొందరి ఇళ్లకు మాత్రమే సర్వే పరిమితం చేస్తున్నారని... గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.