కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. 3 శాతం DA పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. 3 శాతం DA పెంపు

న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం (అక్టోబర్ 28) ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి పెరిగింది. 2026, జూలై 1 నుంచి ఈ పెంపు వర్తి్స్తుందని ప్రభుత్వ తెలిపింది.

మోడీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 1.16 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి పెరిగిందన్నారు.

ALSO READ : అర్నబ్ అప్ డేట్స్: ఏపీలో హై అలర్ట్.. కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు..

2026, జూలై నుంచి ఈ పెంపు వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 48.54 లక్షల మంది ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. అలాగే, దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్లతో కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.