ఏపీలో నవంబర్ 3న జరగాల్సిన MPTC, ZPTC ఎన్నికల్లో కీలక మార్పులు చేసింది ఎన్నికల సంఘం. అనివార్య కారణాల వల్ల ముందుగా ప్రకటించిన పోలింగ్, కౌంటింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. కొత్త షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ నవంబర్ 5కు మార్చినట్లు తెలిపారు.
పోలింగ్ తేదీ మారడంతో నవంబర్ 5న జరగాల్సిన కౌంటింగ్ నవంబర్ 7కు వాయిదా వేసినట్లు తెలిపారు అధికారులు. స్థానిక ఎన్నికల నిర్వహణలో పరిపాలనాపరమైన, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు మరింత సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ఈ గ్యాప్ ను ఉపయోగించనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ క్రమంలో పోలింగ్ తేదీ మారడంతో ప్రచార సమయం కూడా స్వల్పంగా పెరగనుంది.
ALSO READ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. 3 శాతం DA పెంపు
ఇదిలా ఉండగా.. అక్టోబర్ 28న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను నవంబర్ 1కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న క్రమంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
