హైదరాబాద్: బంజారాహిల్స్ ఎస్సై విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ అధినేత రోసిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వివరాల ప్రకారం.. ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన ఓ చీటింగ్ కేసులో ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డిని పోలీసులు నిందితుడిగా చేర్చారు.
అయితే, ఈ కేసులో అరెస్ట్ చేయొద్దంటే రూ.10 లక్షలు ఇవ్వాలని బంజారాహిల్స్ ఎస్సై విజయ్ కుమార్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేకపోవడంతో ఎస్సై విజయ్ అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని భావించిన న్యాయస్థానం రోసిరెడ్డి రిమాండ్‌ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన రోసిరెడ్డిని పాత కేసులను సాకుగా చూపిస్తూ ఎస్సై విజయ్ మళ్లీ వేధించాడు. ఆ కేసుల్లో అరెస్ట్ చేయకుండా ఉండాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశాడు. ఎస్సై వేధింపులు భరించలేకపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు సమర్పించిన ప్రాథమిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు బుధవారం (అక్టోబర్ 28) ఎస్సై విజయ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
