జమ్మికుంట పత్తి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఆగిన కొనుగోళ్లు!..చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్, ఖరీదుదారుల మధ్య వివాదంతో సమస్య

జమ్మికుంట పత్తి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఆగిన కొనుగోళ్లు!..చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్, ఖరీదుదారుల మధ్య వివాదంతో సమస్య
  •     అధికారుల జోక్యంతో మళ్లీ ప్రారంభమైన ప్రక్రియ
  •     దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడ్డ రైతులు 

జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ పి. స్వప్నకు, ఖరీదుదారులకు మధ్య తలెత్తిన వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలం ద్వారా నిర్ణయించిన ధరను మిల్లులకు చేరిన తర్వాత తగ్గిస్తున్నారనే ఆరోపణలపై చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ మిల్లు వ్యాపారి ఎ. రాజయ్యను నిలదీయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనను వ్యాపారి అగౌరవపరిచేలా మాట్లాడారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ పేర్కొనగా, దానికి  నిరసనగా కొనుగోళ్లు  ఆపేశారు. 

దీంతో జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి జిల్లా, మల్హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డలం తాడిచెర్లతో పాటు మొట్లపల్లి, ఇల్లంతకుంట, నాగంపేట, భేతిగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వీణవంక తదితర ప్రాంతాల నుంచి మంగళవారం తెల్లవారుజామునే పత్తిని తీసుకొచ్చిన రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్​లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లి అధికారులను నిలదీశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన మార్కెట్ డీఎంఓ షాబుద్దీన్, సెక్రటరీ మల్లేశంతో పాటు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ప్రణవ్ బాబు చొరవ తీసుకున్నారు. వ్యాపారులతో చర్చలు జరిపి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించాలని కోరడంతో, వారు తిరిగి పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు.