మీ బైక్ పోయిందా.. అయితే ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలంటే వెంటనే ఈ పని చేయకండి!

మీ బైక్ పోయిందా.. అయితే ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలంటే వెంటనే ఈ  పని చేయకండి!

సాధారణంగా బైక్ దొంగతనానికి గురైతే చాలా బాధగా ఉంటుంది. అందులో సొంతంగా బైక్ కొనడానికి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కొంటాం. అలాంటి బైక్ దొంగిలిస్తే ఏం చేయాలో తెలియక ఒకోసారి ఆందోళన పడుతుంటాం. అయితే, అలాంటి సమయంలో కంగారు పడకుండా కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి.... ఏంటంటే....

మీ బైక్‌కు ఇన్సూరెన్స్ ఉంటే, దొంగతనం జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. బైక్ దొంగిలించినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

1. ముందు పోలీస్ కంప్లైంట్
మీ బైక్ దొంగిలించినట్లు తెలిసిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. పోలీసులు మీ ఫిర్యాదును నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ (FIR) ఇస్తారు. బైక్ దొంగతనం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ఎఫ్‌ఐఆర్ చాలా ముఖ్యం. కాబట్టి, ఎఫ్‌ఐఆర్ కాపీని జాగ్రత్తగా పెట్టుకోండి.

2. ఇన్సూరెన్స్ కంపెనీకి  సమాచారం 
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, మీ బైక్ దొంగిలించిన విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి. దీని కోసం కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయవచ్చు లేదంటే ఇమెయిల్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు. వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వడం మంచిది. ఎందుకంటే, క్లెయిమ్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఎలాంటి పేపర్స్ ఇవ్వాలి అనే వివరాలను కంపెనీ మీకు తెలియజేస్తుంది.

3. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫార్మ్ 
ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చిన తర్వాత, బైక్ దొంగతనం క్లెయిమ్ కోసం అవసరమైన ఫార్మ్ తీసుకోండి. ఆ ఫార్మ్ లో అడిగిన వివరాలను సరిగ్గా నింపి, కంపెనీ సూచించిన విధంగా సబ్మిట్ చేయండి. అలాగే, క్లెయిమ్ కోసం ఇంకా ఏ ఏ పేపర్స్ కావాలో ముందుగానే తెలుసుకోండి.

4. అవసరమైన డాకుమెంట్స్ 
బైక్ దొంగతనం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు పొందడానికి కొన్ని ముఖ్యమైన డాకుమెంట్స్ అవసరమవుతాయి.
సాధారణంగా  పోలీస్ ఎఫ్‌ఐఆర్ కాపీ,  బైక్ ఆర్‌సీ (RC), ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, ఆధార్ కార్డు వంటి ప్రూఫ్స్, బైక్ ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వివరాలు, ఇన్సూరెన్స్ కంపెనీ అడిగే ఇతర పేపర్స్,  అవసరమైన పేపర్స్ ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి మారవచ్చు. కాబట్టి, పేపర్స్  ఇచ్చే ముందు కంపెనీని అడిగి తెలుసుకోండి.

5. ఇన్సూరెన్స్ కంపెనీ విచారణ  
మీరు క్లెయిమ్ చేసిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ బైక్ దొంగతనం గురించి విచారణ చేయవచ్చు. దొంగతనం నిజంగా జరిగిందా, మీరు ఇచ్చిన వివరాలు సరైనవేనా, ఇచ్చిన ప్రూఫ్స్ సరిగ్గా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించవచ్చు. అందుకే, క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా నిజమైన వివరాలను ఇవ్వాలి. కంపెనీ అడిగిన ప్రూఫ్స్ లేదా పేపర్స్ కూడా సకాలంలో అందించాలి.

►ALSO READ | ఆన్‌లైన్‌లో లిక్కర్ రిజర్వేషన్.. మందు బాబులకు ఢిల్లీలో కొత్త సర్వీస్

6. క్లెయిమ్   డబ్బులు  
మీరు ఇచ్చిన పేపర్స్/ప్రూఫ్స్  పరిశీలించి, విచారణ పూర్తి చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌పై నిర్ణయం తీసుకుంటుంది. క్లెయిమ్ ఆమోదం పొందితే, మీ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. అయితే, బైక్ దొంగిలించిన మాత్రాన పూర్తి డబ్బులు వస్తాయని చెప్పలేం. మీ బైక్‌కు ఉన్న ఇన్సూరెన్స్ కవరేజీ, పాలసీ నిబంధనలు, బైక్ విలువ వంటి అంశాల ఆధారంగా ఎంత డబ్బు వస్తుందనేది నిర్ణయిస్తారు. కాబట్టి, మీకు ఎంత మొత్తం రావచ్చో ఇన్సూరెన్స్ కంపెనీని అడిగి తెలుసుకోవడం మంచిది.

బైక్ దొంగిలిస్తే  ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీ బైక్ దొంగిలిస్తే  కంగారు పడకుండా ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చి, అవసరమైన డాకుమెంట్స్ లేదా బండి పేపర్స్ రెడీ చేసుకోండి.  క్లెయిమ్ ప్రక్రియలో కంపెనీ అడిగిన వివరాలను సరిగ్గా అందించండి. ఇలా చేయడం వల్ల మీ క్లెయిమ్ ప్రాసెస్ త్వరగా జరగడానికి ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైక్ దొంగిలించి ఉంటె ఇన్సూరెన్స్ డబ్బులు తప్పకుండా వస్తాయని హామీ లేదు. మీ పాలసీ నిబంధనల ప్రకారమే క్లెయిమ్ ఆమోదం, పేమెంట్ పై ఆధారపడి ఉంటాయి.