Sania Mirza: హైదరాబాద్‌కు చెందిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) టెన్నిస్ అకాడమీ స్థలంలో మసీదు నిర్మాణం కోసం భూమిని విరాళంగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె కుటుంబం తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వార్తలన్నీ ముమ్మాటికీ 'ఫేక్ న్యూస్' (Fake News) అని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా తేల్చి చెప్పారు. సామాజిక కార్యకర్త నాజియా ఇలాహీ ఖాన్ అనే మహిళ సానియా మీర్జాను ఉద్దేశించి 'X' (ట్విట్టర్) లో ఒక వీడియో విడుదల చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా వైరల్‌గా మారింది.
సానియా, అజారుద్దీన్ AI జనరేటెడ్ ఇమేజ్:
* ఈ వివాదంపై సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన తండ్రి ఇమ్రాన్ మీర్జా జారీ చేసిన అధికారిక ప్రకటనను షేర్ చేశారు.
* నకిలీ ఫోటోలు: సానియా మీర్జా, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కలిసి ఉన్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించబడిన నకిలీ చిత్రం అని ఆయన వెల్లడించారు.
* మసీదు నిర్మాణం: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (SMTA) నిర్మించిన స్థలంలో ఎలాంటి మసీదు నిర్మాణం జరగడం లేదన్నారు. సానియా లేదా మా కుటుంబం కొనుగోలు చేసిన భూమిని మాకు నచ్చినట్లు ఉపయోగించుకునే హక్కు మాకుంది, కానీ అకాడమీ స్థలంలో మసీదు ఉందనేది పూర్తిగా అసత్యమైందని స్పష్టం చేశారు.
సేవా కార్యక్రమాలు సానియా వ్యక్తిగత విషయం:
సానియా మీర్జా చేసే సామాజిక సేవలను అనవసర వివాదాల్లోకి లాగొద్దని ఇమ్రాన్ మీర్జా సూచించారు. సానియా గతాంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న లేదా భవిష్యత్తులో చేయబోయే ఎలాంటి సామాజిక, ఛారిటీ కార్యక్రమాలైనా ఆమె వ్యక్తిగత విషయాలు.. సానియా స్వయంగా ప్రకటించనంత వరకు వాటిని ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. 6 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుని 2023లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జాపై.. AI టెక్నాలజీతో ఫేక్ ఇమేజ్‌లు క్రియేట్ చేసి ఫేక్ ప్రచారం చేయడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
When tennis player Sania Mirza decided to get married, she chose Pakistan! And when it came to donating land, she chose a mosque! Yet, she earned her name, fame, and wealth from India’s more than 1.2 billion Hindus! @MirzaSania 🤫 https://t.co/62EPqsBy4c
— Nazia Elahi Khan (@NaziaElahiKhan3) October 28, 2026
