Abhishek Sharma: భారత టీ20 స్టార్ బ్యాటర్, ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మేనియా దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ ప్లేయర్‌పై, ఒక లేడీ ఫ్యాన్ చూపించిన అభిమానం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం జరుపుకునే 'కర్వా చౌత్' (Karwa Chauth) పండుగ సందర్భంగా.. ఒక యువతి చందమామతో పాటు మొబైల్ స్క్రీన్పై ఉన్న అభిషేక్ శర్మ ఫోటోను చూస్తూ జల్లెడతో పూజలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అభిషేక్ శర్మ ఫోటోకు అర్ఘ్యం:
* సాంప్రదాయ ప్రకారం కర్వా చౌత్ రోజున మహిళలు రోజంతా నిరీక్షించి, రాత్రి చందమామను జల్లెడలో చూసి 'అర్ఘ్యం' (పవిత్ర జలాన్ని సమర్పించడం) ఇచ్చి ఉపవాసం విరుస్తారు.
* వైరల్ వీడియో: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు అభిమాని చందమామను చూసినట్లే, తన మొబైల్ స్క్రీన్పై ఉన్న అభిషేక్ శర్మ ఫోటోను జల్లెడ ద్వారా చూసింది. అనంతరం అభిషేక్ ఫోటోకే పవిత్ర జలంతో అర్ఘ్యం సమర్పించి తన ప్రేమాభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది.
* షాక్‌లో నెటిజన్లు: ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెటర్లపై అభిమానులకుండే క్రేజ్ ఈ స్థాయికి చేరిందా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మైదానంలోనూ, బయటా నంబర్-1 జోరు:
* ఇటీవలే న్యూజిలాండ్‌పై బాదిన కిరాక్ సెంచరీతో ఐసీసీ టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్- వన్ స్థానాన్ని చేజిక్కించుకున్న అభిషేక్ శర్మ, ఇప్పుడు ఆఫ్-ఫీల్డ్‌లోనూ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దుమ్మురేపుతున్నాడు.
This girl is performing Karwa Chauth rituals in front of cricketer Abhishek Sharma’s photo, just as married women do for their husbands. This is highly inappropriate, yet nobody seems to have a problem with this. Imagine if a man made a video showing a female celebrity as if she were his wife. Just think about the outrage he would face, how heavily he would be trolled, and how feminists would target him. This is the double standard in our society. Girls can treat boys in any way they want, play with their dignity, and make comments about them. But if a boy does the same thing, he is immediately treated like a criminal.
— Saffron Chargers (@SaffronChargers) October 29, 2026
