WPL 2027 వేలం తర్వాత ఫుల్ టీమ్స్.. ఏ జట్టులో ఎవరెవరున్నారో ఇక్కడ చూడండి!

WPL 2027 వేలం తర్వాత ఫుల్ టీమ్స్.. ఏ జట్టులో ఎవరెవరున్నారో ఇక్కడ చూడండి!

WPL 2027 Full Squads: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2027 Mini Auction) 5వ సీజన్ మినీ వేలం పాట బుధవారం (అక్టోబర్ 28) నాడు కొచ్చి వేదికగా ఘనంగా ముగిసింది. ఈ వేలంలో దాదాపు 150 మంది క్రికెటర్లు పాల్గొనగా.. ఐదు ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లను (18 మంది ఇండియన్స్, ఏడుగురు ఓవర్‌సీస్) దక్కించుకున్నాయి. వీరిలో ఏకంగా 14 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండడం విశేషం.

ఈ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రూ. 1.10 కోట్లతో భారీ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్‌గా నిలవగా.. కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఆల్‌రౌండర్ ఉమా కాశ్వీ (Uma Kashvi)ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 లక్షలకు దక్కించుకుని సంచలనం సృష్టించింది. దీంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఉమా కాశ్వీ ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పింది. కాగా, డబ్ల్యూపీఎల్ 2027 5వ సీజన్ పోటీలు 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. కాగా ఏ జట్టులో ఎవరెవరున్నారో అనేది ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్  లో తెలుసుకుందాం.. 

యుపీ వారియర్స్ (UP Warriorz):

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

సోఫీ మోలినెక్స్ (₹1.10 కోట్లు), 
స్నేహ్ రాణా (₹30 లక్షలు), 
గ్రేస్ హ్యారీస్ (₹30 లక్షలు), 
ఆశా శోభనా (₹30 లక్షలు), 
సుష్మా వర్మ (₹10 లక్షలు), 
కాత్రిన్ బ్రైస్ (₹10 లక్షలు), 
మనాలి దక్షిణి (₹10 లక్షలు), 
సహనా పవార్ (₹10 లక్షలు).

రిటైన్డ్ ఆటగాళ్లు: దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తారా నోరిస్ హర్లీన్ డియోల్, శిఖా పాండే, ప్రతికా రావల్, క్రాంతి గౌడ్, సిమ్రాన్ షేక్, షిప్రా గిరి.

గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants):

* వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

జి కమలిని (₹40 లక్షలు)
ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (₹30 లక్షలు)
సమైరా రాఘవ (₹10 లక్షలు)

* రిటైన్డ్ ప్లేయర్స్: బెత్ మూనీ, యాష్లీ గార్డనర్, సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, యస్తికా భాటియా, అనుష్క శర్మ, భారతి ఫుల్‌మాలి, కనికా అహూజా, హ్యాపీ కుమారి, జింటిమణి కలిత.

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals):

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

కిరణ్ నవ్‌గిరే (₹75 లక్షలు) 
ఉమా కాశ్వీ (₹10 లక్షలు) 
కిర్‌స్టీ గోర్డన్ (₹10 లక్షలు) 
నజ్మా ఖాన్ (₹10 లక్షలు)

రిటైన్డ్ ఆటగాళ్లు: జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మారిజేన్ కాప్, లారా వోల్వార్డ్, చినెల్లే హెన్రీ, లూసీ హామిల్టన్, మిన్ను మణి, నికి ప్రసాద్, శ్రీ చరణి, మమతా మడివాల, నందిని శర్మ, దియా యాదవ్.

ముంబై ఇండియన్స్ (Mumbai Indians):

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

శ్వేత సెహ్రావత్ (₹20 లక్షలు) 
దిశా కసత్ (₹10 లక్షలు) 
లతికా ఇనామ్‌దార్ (₹10 లక్షలు) 
భారతీ రావల్ (₹10 లక్షలు) 
సనికా చల్కే (₹10 లక్షలు) 
అక్షిత భగత్ (₹10 లక్షలు)

రిటైన్డ్ ఆటగాళ్లు: హర్మన్‌ప్రీత్ కౌర్, నాటాలీ సైవర్-బ్రంట్, అమేలియా కేర్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్, సజీవన్ సజనా, సంస్కృతి గుప్తా, రహీలా ఫిర్దోస్, వైష్ణవి శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru):

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

జెస్ జొనాసెన్ (₹40 లక్షలు) 
క్లో ట్రయాన్ (₹30 లక్షలు) 
తేజల్ హసబ్నిస్ (₹30 లక్షలు) 
వ్రిందా దినేష్ (₹10 లక్షలు)

రిటైన్డ్ ఆటగాళ్లు: స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వోల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, ప్రేమా రావత్, ప్రత్యూష కుమార్.