WPL మినీ వేలం: మోలినెక్స్‌కు రూ.1.1 కోట్లు.. ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసిందంటే?

WPL మినీ వేలం: మోలినెక్స్‌కు రూ.1.1 కోట్లు.. ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసిందంటే?

WPL Auction 2027: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2027 Mini Auction) ఐదో సీజన్ మినీ వేలం పాట కొచ్చిలోని 'గ్రాండ్ హయత్' హోటల్‌లో ఘనంగా ముగిసింది. పొట్టి ఫార్మాట్ సంగ్రామంలో మిగిలిన ఖాళీ స్లాట్లను భర్తీ చేసేందుకు ఐదు ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. ఈ వేలంలో పాల్గొన్న 150 మంది ఆటగాళ్లలో మొత్తం 25 మంది ప్లేయర్లను వివిధ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

భారీ ధరకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్: 

ఈ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రూ. 1.1 కోట్లతో అత్యధిక ధర పొందిన ప్లేయర్ గా నిలవగా.. భారత యువ క్రీడాకారిణులు కిరణ్ నవగిరే, జి. కమలినిలకు కూడా మంచి ధరకు సేల్ అయ్యారు. వేలం ప్రారంభంలో సైలెంట్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చివర్లో వ్యూహాత్మకంగా ముగ్గురు కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. 

వేలంలో అత్యధిక ధర సాధించిన స్టార్స్:

* సోఫీ మోలినెక్స్ (Sophie Molineux): రూ. 1.10 కోట్లు (యుపి వారియర్స్)
* కిరణ్ నవగిరే (Kiran Navgire): రూ. 75 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
* జి. కమలినీ (G. Kamalini): రూ. 40 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
* జెప్ జోనాసెన్ (Jess Jonassen): రూ. 40 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)

ఫ్రాంచైజీల వారీగా అమ్ముడుపోయిన ప్లేయర్స్ ఫుల్ లిస్ట్: 

యుపీ వారియర్స్ (UP Warriorz):

* సోఫీ మోలినెక్స్ (ఆల్‌రౌండర్) – ₹1.10 కోట్లు
* గ్రేస్ హారిస్ (ఆల్‌రౌండర్) – ₹30 లక్షలు
* స్నేహ్ రాణా (ఆల్‌రౌండర్) – ₹30 లక్షలు
* సుష్మా వర్మ (వికెట్ కీపర్) – ₹30 లక్షలు
* ఆశా శోభన (బౌలర్) – ₹30 లక్షలు
* క్యాథరిన్ బ్రైస్ (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు
* మనాలి దక్షిణి (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు
* సహానా పవార్ (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals):

* కిరణ్ నవగిరే (బ్యాటర్) – ₹75 లక్షలు
* జెస్ జోనాసెన్ (ఆల్‌రౌండర్) – ₹40 లక్షలు
* కర్స్టీ గోర్డాన్ (బౌలర్) – ₹10 లక్షలు
* ఉమా కశ్వి (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు
* నజ్మా ఖాన్ (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు

గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants):

* జి. కమలినీ (బ్యాటర్) – ₹40 లక్షలు
* ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఆల్‌రౌండర్) – ₹30 లక్షలు
* సమైరా రాఘవ్ (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు

ముంబై ఇండియన్స్ (Mumbai Indians):

* శ్వేతా సెహ్రావత్ (బ్యాటర్) – ₹20 లక్షలు
* దిశా కసత్ (బ్యాటర్) – ₹10 లక్షలు
* సానికా చాల్కే (బ్యాటర్) – ₹10 లక్షలు
* భారతీ రావల్ (బౌలర్) – ₹10 లక్షలు
* అక్షితా భగత్ (ఆల్‌రౌండర్) – ₹10 లక్షలు
* లతిక ఇనామ్‌దార్ (వికెట్ కీపర్) – ₹10 లక్షలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):

* తేజల్ హసబ్నిస్ (బ్యాటర్) – ₹30 లక్షలు
* క్లో ట్రయాన్ (ఆల్‌రౌండర్) – ₹30 లక్షలు
* బృందా దినేష్ (బ్యాటర్) – ₹10 లక్షలు